Ads block

Banner 728x90px

స్వాగతం


 సందర్శకులకు ఆత్మీయ స్వాగతం......

    nellorestatisticians.org వెబ్ సైట్ వీక్షకులకు / సందర్శకులకు మరియు  వినియోగించుకునే వారికి ముందుగా "ప్రపంచ గణాంక దినోత్సవం" (20.10.2020) శుభాకాంక్షలు......

   nellorestaticians.org అనేది ఆంధ్రప్రదేశ్  గణాంక శాఖకు చెందిన ప్రస్తుత మరియు రేపటితరం నెల్లూరుజిల్లా క్షేత్రస్థాయి ఉద్యోగులకు, జిల్లా గణాంకాలు అవసరం అయిన ఇతర శాఖల వారికి, కొంతమేరకు జిల్లాలోని అధ్యయన పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న  ఒక సాంఖ్యక లోకపు సాంకేతిక మహాద్వారం....

     భారత గణాంకాల పితామహుడు పద్మవిభూషణ్  PC. మహల్ నోబిస్, భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య అమర్త్య సేన్ మరియు మన ఆంధ్ర గణాంకశాఖ అభివృద్ధి కారకులు పద్మవిభూషణ్ CR రావు గారి సంస్మరణలు ముఖచిత్రంగా వెలసిన మన వెబ్ సైట్...

     ఆంధ్రప్రదేశ్ అర్థ గణాంకశాఖ ఉద్యోగులకు శాఖా పరంగా విధినిర్వహణలో నిరంతరం తోడుగా ఉండతగిన ఒక e గ్రంధం. DES క్షేత్ర స్థాయి ఉద్యోగులకు శాఖా పరంగా విధివిధానాలు, ఉద్యోగ హక్కులు, భాద్యతలు వగైరా సమాచారాలకి సాంకేతికమదింపు,  ఇతర శాఖల వారికి మరియు పరిశోధకులకు అవసరమైన గణాంకాల e సమీకరణ తదితర సౌలభ్యాలతో వెలసిన ఒక..... e గ్రంధాలయం.

ఈ గ్రంథాలయాన అమరిక పరిశీలిస్తే...

Depatmental (DES) శీర్షికలో శాఖాపరమైన విభిన్న అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయి ఉద్యోగులకు చక్కని మార్గదర్శనం ఉంది. .

Census & Surveys శీర్షిక నందు గడచిన సర్వే లలో సేకరించి వివిధ ప్రచురణలలో ఉన్న విభిన్న దత్తంశాలు, వాటి సాంఖ్యక విశ్లేషణలు, అంచనాలు పొందుబరచబడ్డాయ్... ఎప్పటికప్పుడు తాజా సమాచారాలతో సమగ్రం అవుతాయి కూడా!

      Manuals శీర్షిక క్రింద శాఖా పరంగా పలురకముల సర్వే ల నిర్వహణకై  e సూచనల పుస్తకాలు pdf రూపంలో అమర్చబడ్డాయ్. 

      మరీముఖ్యంగా service matters శీర్షికలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా ఉన్న మన విధివిధానాలు, హక్కులు, బాధ్యతలు pdf పుస్తక రూపాలతో పాటుగా  OPS/CPS ఉద్యోగుల పొదుపు వివరాలు, APGLI వాయిదాల స్థితి, e సర్వీస్ రిజిస్టర్ మార్గదర్శనం, శాఖా పరమైన పరీక్షల దరఖాస్తు, అభ్యసన పుస్తకాలు, ఆదాయపన్ను మదింపు సాఫ్ట్ వెర్ తదితరాలతో పాటుగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉపయోగపడే ప్రభుత్వ నిర్దేశాలు (G.O లు ), ఇతర ముఖ్య GO లతో పాటుగా ఉద్యోగులకు అవసరమైన వివిధ దరఖాస్తు నమూనాలను కూడా అందుబాటులో ఉంచాము.

    ఇక APESSA శీర్షికలో APDES లోని క్షేత్రస్థాయి ఉద్యోగుల సంఘం APESSA గురించి.. ప్రధానంగా నెల్లూరుజిల్లా శాఖలో సేవలందించిన, అందిస్తున్న వారిని పరిచయం చేసుకుంటూ, ఇకపై జరుగనున్న APESSA కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడం జరుగుతుంది...

   DES క్షేత్ర స్థాయి ఉద్యోగులకు పైన ఉదహరించిన అన్ని అంశాలలోను తాజా సంక్షిప్త సమాచారం స్క్రోల్ అయే సౌకర్యంతోపాటు, సమీక్షా సమావేశములు, శాఖాపరమైన ఇతర సంతోషకర సందర్భాలను దృశ్య రూపంలో  చూసుకోగల అవకాశం ఉంది.

   ఇంకా ఇందులో జిల్లా ప్రణాళికా శాఖ ఉన్నతాధికారుల ఛాయాచిత్రాలతోపాటు జిల్లాలో పని చేస్తున్న ప్రణాళికాకుటుంబ సభ్యుల వివరాలు కూడా PLANNING TEAM శీర్షికలో దిగువన అందించబడ్డాయి.

         nellorestatisticians.org ప్రణాళికాశాఖ ప్రయోజనాలను ఇతర శాఖలకు ఇంపుగా చూపించే ఒక గవాక్షం కూడా!!

       ప్రస్తుతం నెల్లూరు జిల్లా జనాభా, వ్యవసాయ తదితర గణాంకాలు పరిశోధకులకు, బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రాజెక్ట్ పనులకు ప్రయోజనకరం.

       ఇక ఈ nellorestatisticians.org స్థితి గతులను గమనించి వీక్షకులుగా, ఉపయోగించుకునే వారిగా మీరు అందించే అభిప్రాయాలను సవినయంగా ఎప్పటికప్పుడు పరిగణనలోకి  తీసుకుంటూ నిరంతరం మెరుగుపరచుకునే ప్రయత్నం చేసుకుంటాము.

       రేపటితరం పరిశోధకులకు కూడా ఒక చేతిపుస్తకంగా మొదలయి ఒక సమగ్ర ఉపయుక్త గణాంక గ్రంధం గా రూపాంతరం చెందగల సమర్ధతతో  ఈ సాంకేతిక సాంఖ్యక మహాద్వారం. ను  దృఢంగా నిర్మించడం మా తదుపరి లక్ష్యం.....


                



                                             
                                  కీర్తన సాఫ్ట్ వేర్స్, చెన్నై-వెంకటగిరి  వారి సాంకేతిక నిర్మాణంతో
                                 నెల్లూరు గణకులు

                             e చిరునామా : nellorestatisticians@gmail.com

14 comments:

  1. Good Efforts by Prasad Sir and Rama Kishore..

    ReplyDelete
  2. This is gateway to the new generation.

    Thank u team

    💐💐💐

    ReplyDelete
  3. చూడడానికి చాలా క్లుప్తంగా వున్నా సమగ్రంగా ఉంది అంటే దీనివెనుక రూపకర్తల కృషి చాలా ఉంది.అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. THANKS TO TANGUTURI VENKATA RAMANA SIR, JB COLLEGE, KAVALI


      PVSTR.PRASAD, ASO
      for Nellore Statisticians

      Delete
  4. Excellent work. Usefull for all agri dept empl. Tq soo much

    Sravani, AEO, nellore

    ReplyDelete
    Replies
    1. THANK YOU MADAM, SRAVANI, AEO KOVUR (IC) GARU FOR GIVING A GOOD SPIRIT TO OUR TEAM..

      for
      TEAM NELLORE STATISTICIANS

      Delete
  5. Try to develop an app on this for easy access.

    Sravani, aeo, nellore

    ReplyDelete
    Replies
    1. SURE MADAM.. OUR TEACHNICAL TEAM HAVE ALREADY A PLAN ON THIS. IT WILL DEFENITELY BE SPEED UP

      THANK YOU VERY MUCH FOR YOUR VALUABLE FEED BACK

      Delete